
అత్యాచారం, కిడ్నాపింగ్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న భారత సంతతి వ్యక్తి గుర్మీత్ సింగ్ పౌరసత్వాన్ని అమెరికా ఫెడరల్ కోర్టు రద్దు చేసింది.
పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో తన నేర చరిత్రను దాచిపెట్టినందుకు ఈ చర్య తీసుకున్నట్లు న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది.
సెప్టెంబర్ 16 లోపు తన పాస్పోర్టు మరియు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను సరెండర్ చేయాలని గుర్మీత్ సింగ్ను న్యాయస్థానం ఆదేశించింది.