
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
తిరుపతిలోని పెదకాపు వీధిలో ఉన్న లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లు, తిరుమలలోని బి టైప్ 53 గెస్ట్ హౌస్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఎస్టీవీ నగర్ ఎస్బీఐ బ్రాంచ్లో లోకనాథంకు లాకర్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు, టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒక అధికారి ఇంట్లో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది.