
ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో వరుస ఓటముల నేపథ్యంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కాంట్రాక్టులను బీసీసీఐ పునరుద్ధరించడం లేదు.
టెన్ డోషేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10తో, దిలీప్ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ జూన్ 8తో ముగిసినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక కోసం ఎన్సీఏకు చెందిన శుభదీప్ ఘోష్‌తో సహా పలువురు అభ్యర్థులతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది.