
సౌర విద్యుదుత్పాదన తయారీలో సెమీకండక్టర్ స్వభావం కలిగిన సిలికాన్ స్ఫటిక పదార్థంతో సోలార్ ఇటుకలు (ఇంగాట్స్) తయారు చేస్తారు.
ఆ ఇంగాట్స్ను సన్నని పొరగా (వేఫర్) తరిగి, ఒక్కో పొరపై సౌర ఘటాలు (సోలార్ సెల్స్) పొదగాల్సి ఉంటుంది.
చివరికి ఈ పొరలన్నింటినీ కూర్పు చేసి సౌర ఫలకాలుగా (ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్) మారుస్తారు.