
అద్దంకిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో దొరికిన గంజాయి, మద్యం వేరే కేసులో సీజ్ చేసినవేనని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే బల్లికురవ, సంతమాగులూరు ఎస్ఐలు నాగరాజు, నాగమల్లేశ్వరరావు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని ఎస్పీ తెలిపారు.
పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.