
సూర్యాపేట జిల్లాలో విద్యాశాఖ ప్రక్షాళనలో భాగంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి 191 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు.
ఉపాధ్యాయుల కొరత ఉన్న ఉన్నత పాఠశాలలకు వీరిని సర్దుబాటు చేయడం ద్వారా మెరుగైన విద్యాబోధన అందించాలని కలెక్టర్ తేజ్సనందలాల్పవార్ నిర్ణయించారు.
తెలుగు, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం బోధించే స్కూల్ అసిస్టెంట్లతో పాటు ఎస్జీటీలను కూడా అవసరమైన పాఠశాలలకు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.