
అంతరిక్షంలో తాము ఆయుధాలను మోహరించామని అమెరికా స్పేస్ ఫోర్స్ తొలిసారి అధికారికంగా వెల్లడించింది.
మేరీల్యాండ్‌లోని నేషనల్ హార్బర్లో జరిగిన వార్షిక ఎయిర్, స్పేస్ అండ్ సైబర్ కాన్ఫరెన్స్‌లో యూఎస్ ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మీంక్ ఈ వివరాలు తెలిపారు.
శత్రువుల నుంచి అమెరికా బలగాలను రక్షించడానికి ఆన్-ఆర్బిట్ ఆయుధాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.