నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈశ్వర గోపాల్ ఇంట్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
14 ఏళ్ల సర్వీసులో ఈశ్వర గోపాల్ సుమారు రూ. 10 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించింది.
అక్రమ ఆస్తుల కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ కోసం కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.