
జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని చిన్న వ్యాపారులకు సైతం కేవలం ఒక్క రోజులో లోన్లు అందించేందుకు ఎస్‌బీఐ కొత్త టెక్నాలజీ సొల్యూషన్‌ను సిద్ధం చేస్తోంది.
ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఎస్‌బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ ఈ వివరాలను వెల్లడించారు.
వ్యాపారుల క్యాష్ ఫ్లో అంచనా వేయడానికి జీఎస్టీకి బదులుగా యూపీఐ లావాదేవీల రికార్డులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించనున్నారు.