
వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్-యూజీని కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానానికి మార్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ అభిషేక్ సింగ్ వెల్లడించారు.
ఈ ప్రతిపాదిత మార్పు ప్రణాళికపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకణి నేతృత్వంలోని హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన ప్రధాన కార్యాలయాన్ని దక్షిణ ఢిల్లీలోని ఓఖ్లా నుంచి సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్‌కు మార్చింది.