
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా తొలి భాగానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
నవంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి ఇండియాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.25.77 కోట్ల గ్రాస్ వసూలైనట్లు సాక్నిల్క్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ-సేల్స్ విలువ సుమారు రూ.80.8 కోట్లకు చేరింది.