
భోజనం చేసిన తర్వాత ఛాతీలో వచ్చే నొప్పిని చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తారని, కానీ ఇది కొన్నిసార్లు ప్రాణాంతకమైన గుండెపోటు తొలి సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కడుపులోని యాసిడ్ పైకి ఎగదన్నడం వల్ల వచ్చే గ్యాస్ మంట ఛాతీ మధ్యభాగంలో ప్రారంభమై గొంతు వరకు పాకి, నోటిలో చేదు లేదా పుల్లని భావన కలిగిస్తుంది.
అదే గుండెపోటు సమయంలో ఛాతీ మధ్యలో తీవ్రమైన ఒత్తిడి, బరువుగా అనిపించడం, ఆయాసంతో పాటు ఆ నొప్పి చేతులు, వీపు, మెడ లేదా దవడకు వ్యాపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.