
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బుధవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
వైద్యుల సూచన మేరకు భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లగా, సాయంత్రం 4 గంటలకు చికిత్స పూర్తవుతుందని వైద్యులు తెలిపారు.
ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్నారనే సమాచారంతో అభిమానులు పెద్ద సంఖ్యలో కిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.