
వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
ఒకే అభ్యర్థి జవాబుపత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేసినప్పుడు, మూడు వేర్వేరు సందర్భాల్లో మూడు రకాల మార్కులు వేసినట్లు సిట్ హైకోర్టుకు నివేదించింది.
ఈ అక్రమాలపై సిట్ సమర్పించిన నివేదికను పరిశీలించిన హైకోర్టు, తదుపరి విచారణను కొనసాగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.