
రాష్ట్రంలో ఈ ఏడాది 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటివరకు కేవలం 21 శాతం (47.3 మిలియన్ కేజీలు) మాత్రమే కొనుగోలు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.
మిగిలిన పంటను అమ్ముకోలేక రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పొగాకు రైతుల సమస్యలపై జగన్ దేవరపల్లి పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.