మహిళల ఆంధ్రా ప్రిమియర్ లీగ్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు విజయం సాధించింది.
గోదావరి జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అమరావతి జట్టు 143 పరుగులకు ఆలౌటై, కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.