
తమ సిస్టమ్స్‌లో డేటా ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలను ఐటీ దిగ్గజం టీసీఎస్ సోమవారం అధికారికంగా తోసిపుచ్చింది.
బహిర్గతమైన డేటా నాలుగేళ్ల క్రితం నాటిదని, అందులో కేవలం ప్రాథమిక ఉద్యోగ వివరాలు మాత్రమే ఉన్నాయని కంపెనీ స్పష్టం చేసింది.
కస్టమర్ల సమాచారానికి గానీ, కంపెనీ నిర్వహణ వ్యవస్థలకు గానీ ఎటువంటి ముప్పు వాటిల్లలేదని టీసీఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.