
మొబైల్ ఫోన్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన IMEI నంబర్‌ను ట్యాంపరింగ్ చేయడం లేదా మార్చడం తీవ్రమైన నేరమని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ నేరానికి పాల్పడేవారికి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది.
పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేసే వీలున్న ఈ నేరాలకు సంబంధించిన వివరాలను సంచార్ సాథి ప్లాట్‌ఫామ్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.