
ప్రమాదం కారణంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న బాలకృష్ణ, త్వరలోనే షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బికె 111 చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సంక్రాంతికి ఇతర స్టార్ హీరోల సినిమాలు భారీగా ఉండటంతో, సోలో రిలీజ్ కోసం క్రిస్మస్ తేదీని ఎంచుకోవడం ఉత్తమమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.