
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన అపోలియన్ డైనమిక్స్ రూపొందించిన 'ఆహుతి ఎంకే-2' డ్రోన్ గంటకు 498 కి.మీ వేగంతో ప్రయాణించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
దక్షిణాసియాలోనే అత్యంత వేగవంతమైన మల్టీరోటర్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌గా నిలిచిన దీనిని, శత్రువుల షాహెద్ తరహా డ్రోన్లను అడ్డుకునేందుకు అభివృద్ధి చేశారు.
2025లో 300 కి.మీ వేగంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, ఏడాదిలోనే వేగాన్ని 66 శాతం పెంచి ఈ మైలురాయిని చేరుకుందని సంస్థ వ్యవస్థాపకులు జయంత్ ఖత్రి, సౌర్య చౌదరి తెలిపారు.