
ఇంగ్లండ్ తూర్పు తీరంలోని 'ది వాష్' ప్రాంతంలో 45.4 కోట్ల ఏళ్ల నాటి భారీ సూపర్‌వొల్కనో ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ అగ్నిపర్వతం డైనోసార్ల కాలానికి 20 కోట్ల ఏళ్ల ముందే బద్దలైందని, దీని పేలుడు వేల హైడ్రోజన్ బాంబుల శక్తికి సమానమని పరిశోధకులు అంచనా వేశారు.
బ్రిటిష్ జియోలాజికల్ సర్వే మరియు ఓస్లో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 80 ఏళ్ల క్రితం సేకరించిన రాతి నమూనాల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు.