
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి.
తెలంగాణలో ఈ నిబంధన అమలు మందకొడిగా సాగుతుండటంతో గత రెండు విద్యా సంవత్సరాలలో కేవలం 180 మందికే ప్రవేశాలు లభించాయి.
ఈ అంశంపై ఈ నెల 27న జరిగే విచారణకు హాజరై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.