
ఈపీఎఫ్ సభ్యులకు డిజిటల్ సేవలను సులభతరం చేసేందుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారిక వాట్సాప్ చానల్‌ను ప్రారంభించింది.
పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ తదితర వ్యక్తిగత సేవలను అందించేందుకు త్వరలోనే ప్రత్యేక ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
నకిలీ మెసేజ్‌లు మరియు మోసపూరిత కాల్స్ పట్ల సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకూడదని ఈపీఎఫ్‌వో హెచ్చరించింది.