
భద్రాచలానికి చెందిన ఎస్బీఐ విశ్రాంత అధికారి డి.వి. శంకరరావు ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
వయసు 74 ఏళ్లు అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆయన ఈ పోటీల్లో పాల్గొని రాణించారు.
ఒకే వారం వ్యవధిలో రెండు పతకాలను సొంతం చేసుకుని శంకరరావు భారతదేశ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు.