
జామ ఆకులు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహజంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం పరగడుపున 2 నుంచి 3 లేత జామ ఆకులను నమిలి తినడం లేదా ఆకులతో టీ చేసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
జామ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచి డయాబెటీస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.