
నమీబియాతో జరిగిన ట్రై-సిరీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా బ్యాటర్ లూహాన్-డ్రే ప్రిటోరియస్ 53 బంతుల్లో 101 పరుగులు చేసి టీ20 సెంచరీ సాధించాడు.
20 ఏళ్ల 161 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన ప్రిటోరియస్, పూర్తిస్థాయి జట్టు తరఫున టీ20 సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 228 పరుగులు చేయగా, నమీబియా 217 పరుగులకే పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.