
మెగా డీఎస్సీ-2025పై అసెంబ్లీలో చర్చకు రావాలని మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్ ను మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పించుకుంటున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు విమర్శించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా తయారీ, ప్రొడక్షన్ మరియు శిక్షణ అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
దేశంలో 6 లక్షల డ్రోన్ల అవసరం ఉండగా ప్రస్తుతం 40 వేలు మాత్రమే ఉన్నాయని, విదేశీ దిగుమతులను కేంద్రం నిషేధించిందని రామ్మోహన నాయుడు వివరించారు.