
విద్యార్థులు చదువు కోసం పడే కష్టాలను తగ్గించే ఉద్దేశంతో నెల్లూరులో 10 వేల సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
తాను చదువుకునే రోజుల్లో రోజుకు మూడు కిలోమీటర్లు నడిచిన కష్టాలను నేటి విద్యార్థులు పడకూడదని మంత్రి నారాయణ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ పంపిణీ ద్వారా స్థానిక విద్యార్థినులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.