
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని మిఠాయిల తయారీ కేంద్రాలు, నూనె మిల్లులు, ఆహార ప్రాసెస్ యూనిట్లలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలను గురువారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాసెసింగ్ కేంద్రాలలో అధికారులు ప్రత్యేకంగా చేపట్టారు.
ఆహార కల్తీలను అరికట్టేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలను కొనసాగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.