
ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న చైనా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు.
ఇరాన్ నుంచి చమురు కొనుగోలులో చైనా బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిపై సెకండరీ ఆంక్షలు విధిస్తే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని ప్రకటించడంతో, ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.