
విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామంలో కిడ్నీ వ్యాధితో గత ఏడేళ్లలో 11 మంది మృతి చెందారు.
ప్రస్తుతం మరో 12 మంది ఈ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
గ్రామంలోని బోరు నీరు కలుషితం కావడం వల్లే ఈ సమస్య తలెత్తిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తు చేయగా, అధికారులు నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.