
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నరేందర్‌రెడ్డి ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కేసీఆర్ విలువలకు తిలోదకాలిచ్చారని ఆయన విమర్శించారు.