
మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
ఈనెల 11నే విచారణకు హాజరుకావాలని అధికారులు ఫోన్ ద్వారా ఆయనకు సమాచారం అందించారు.
అయితే నోటీసులు ఏ కేసులో ఇచ్చారనే విషయం తనకు తెలియదని అంబటి బదులివ్వగా, కార్యాలయానికి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.