
అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ మహిళలు మిలిటరీ అధికారులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలలో పాల్గొని ఆయుధాల వినియోగంపై తర్ఫీదు పొందారు.
ఇమామ్ హుస్సేన్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు రైఫిల్స్, హ్యాండ్గన్స్ను ఎలా ఉపయోగించాలో మిలిటరీ అధికారులు నేర్పించారు.
కుటుంబాలను కాపాడుకునేందుకే తాము శిక్షణ తీసుకుంటున్నామని, యుద్ధం కోసం కాదని ట్రెయినింగ్ క్యాంపుల్లోని మహిళలు పేర్కొన్నారు.