
ఏపీలో రామాయపట్నం పోర్టు సమీపంలో సుమారు రూ.1.45 లక్షల భారీ వ్యయంతో నిర్మించనున్న బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి.
ఈ ప్రాజెక్టును 5 వేల 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుండగా, దీని ద్వారా ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పెట్రోల్, డీజిల్, నాఫ్టా వంటి ఇంధనాలు ఉత్పత్తి చేయనున్నారు.
ప్రాజెక్టులో 30 శాతం మేర గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయాలని మరియు కాలుష్య నివారణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని బీపీసీఎల్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.