
ఇరాన్‌పై యుద్ధంలో విజయం సాధించాక ఇంధన ధరలు భారీగా తగ్గి, గ్యాలన్ ధర 2 డాలర్ల దిగువకు చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలే ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ఆయన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
ఇరాన్ ఇంధన వసతులను టార్గెట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ అమెరికాను హెచ్చరించారు.