
టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు రూ.25వేల కోట్ల భారీ ఆఫర్‌ను తెరపైకి తెచ్చారు.
టాటా సన్స్‌లో ఉన్న ఎస్పీ గ్రూప్ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆర్థిక ఉపశమనం కలిగించాలని ఈ ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రక్రియను రెండు విడతలుగా 18 నెలల కాలంలో పూర్తి చేయాలని బోర్డు సమావేశంలో ప్రతిపాదించారు.