
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక నిందితుడైన సురేశ్‌కు కోర్టు సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ విధించింది.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను పాడుబడ్డ భవనానికి తరలించగా, అక్కడే ఆయన స్పృహ తప్పి మరణించాడు.
నిందితుడు సురేశ్, సీఐ నాగరాజు తదితరులు కలిసి మృతదేహాన్ని స్వర్గపురిలో దహనం చేసినట్లు సిట్ రిపోర్టులో వెల్లడైంది.