
చైనా నుంచి వస్తున్న భారీ డిమాండ్‌తో పాకిస్థాన్‌లో గాడిద మాంసం, చర్మం ఎగుమతుల వ్యాపారం ఊపందుకుంది.
గ్వాదర్ సమీపంలో ఏర్పాటు చేసిన స్లాటర్ హౌస్‌ను హ్యాంగెంగ్ గ్రూప్ నిర్వహిస్తోందని సీఈఓ ఆండీ లియావో తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆరు నెలల్లో నెలకు సుమారు 5 మిలియన్ డాలర్ల మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు.