
దుబాయ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
ఓపెనర్లు స్మృతి మంధాన (59), షఫాలీ వర్మ (68) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగి తొలి వికెట్కు 129 పరుగుల భాగస్వామ్యం అందించారు.
దీంతో శ్రీలంక మహిళల జట్టు విజయం కోసం భారత్ 184 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.