
అఫ్గానిస్థాన్‌లోని హెల్మండ్, కునార్ ప్రావిన్సులపై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో 9 మంది మహిళలు, చిన్నారులు మృతి చెందగా, మరో 11 మంది పౌరులు గాయపడినట్లు అఫ్గాన్ తెలిపింది.
తమ దాడుల్లో 22 మంది ఉగ్రవాదులు మరణించారని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ పేర్కొంది.