
జపాన్ ఫార్మా దిగ్గజం తకేడా ఫార్మా అభివృద్ధి చేసిన ‘క్యుడెంగా’ డెంగ్యూ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ తయారు చేయనుంది.
ఈ ఒప్పందం కింద ఏటా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ టీకా 2027 ప్రథమార్ధంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.