
అమెరికా మీడియా తమపై ప్రతికూల కవరేజ్ ఇస్తోందనే అసంతృప్తితో వైట్‌హౌస్ ఏకంగా 24 గంటల ప్రసారాలతో 'ట్రంప్ టీవీ'ని ప్రారంభించింది.
వైట్‌హౌస్‌లోకి కొన్ని మీడియా సంస్థలను నిషేధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ ఈ సొంత ప్రసార వేదికను అందుబాటులోకి తెచ్చారు.
ఈ సరికొత్త చానెల్ ద్వారా ట్రంప్‌కు సంబంధించిన సానుకూల వార్తలు, కవరేజ్ ప్రసారం కానున్నాయి.