
రూ. 2,000కు మించిన UPI లావాదేవీలపై కొత్తగా విధించిన MDR దేశంలోని మెజారిటీ వ్యాపారులపై ప్రభావం చూపదని NPCI స్పష్టం చేసింది.
డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల్లో 75% మందికి ఈ కొత్త నిబంధన వర్తించదని NPCI MD & CEO దిలీప్ అస్బే తెలిపారు.
ఈ MDR భారం అధికంగా పెద్ద వ్యాపార సంస్థలపైనే పడుతుందని, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు.