
కృత్రిమ మేధ (AI) రాకతో టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లు జరుగుతున్నప్పటికీ, భారత్‌లో ఉద్యోగాల కోతల కంటే కొత్త అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నోమురా నివేదిక పేర్కొంది.
ఏఐ సాంకేతికత వల్ల పని చేసే విధానంలో మార్పులు వస్తున్నాయని, ఇది భవిష్యత్తులో మరిన్ని కొత్త రకాల ఉద్యోగాలకు దారితీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టెక్ రంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ, నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరిగి కొత్త నియామకాలు ఊపందుకుంటున్నాయని నివేదిక స్పష్టం చేసింది.