
తెలంగాణలో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.
షెడ్యూల్ ప్రకారం కాలుష్య నియంత్రణ మండలి, ఏఈఈ, డీఈవో మరియు హెచ్‌ఎం పోస్టులకు అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు జరగనున్నాయి.