
ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులతో సమీక్ష జరిపారు.
గత ఐదు రోజులుగా సముద్రానికి వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి వంశధార నీటిని రిజర్వాయర్లోకి తరలించాలని సూచించారు.