
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్లోని సబర్మతి నదిపై 480 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణాన్ని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ విజయవంతంగా పూర్తి చేసింది.
అహ్మదాబాద్, సబర్మతి స్టేషన్ల మధ్య ఉన్న ఈ వంతెన ఎత్తు సుమారు 36 మీటర్లు ఉండగా, దీనిని బ్యాలెన్స్డ్ కాంటిలివర్ మెథడ్ టెక్నాలజీతో నిర్మించారు.
గుజరాత్లో ఇప్పటివరకు మొత్తం 18 నదీ వంతెనల నిర్మాణం పూర్తయినట్లు ఈ ప్రాజెక్టులో పేర్కొన్నారు.