తెలంగాణలో నవంబర్ 1 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.
గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 66.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.