
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై శనివారం హూతీలు జరిపిన క్షిపణి దాడిలో హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ మృతి చెందారు.
ఈ దాడిలో అలీ కుటుంబంలోని మరో ముగ్గురు సహా మొత్తం 11 మంది భారతీయులకు గాయాలయ్యాయి.
దాడి నేపథ్యంలో విమానాశ్రయాన్ని ఖాళీ చేయడంతో పాటు విమానాల రాకపోకలు నిలిపివేశారు.